నల్లమల్ల ఫారెస్ట్‌ లో భారీ అగ్ని ప్రమాదం..

Feb 19,2024 08:03 #Fire Accident, #nallamala forest

నాగర్‌ కర్నూలు: నాగర్‌ కర్నూలు జిల్లాలోని నల్లమల ఫారెస్ట్‌ లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి మల్లెల తీర్థం తాటి గుండాలలో అడవి తగలబడుతోంది స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్రి మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను ఆర్పే క్రమంలో ఫైర్‌ వాచర్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. నల్లమల ఫారెస్ట్‌ లో మంటలు ఎగిసి పడుతుండడంతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి మాత్రం అన్నది తెలియాల్సి ఉంది. స్థానికులు భయబ్రాంతులకు గురికాకుండా అధికారులు ధైర్యం చెబుతున్నారు.

➡️