నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పిటీషన్‌ను వాయిదా వేసిన హైకోర్టు..

Jan 5,2024 16:09 #adjourned, #telangana high court

హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్‌ చేసిన దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసిందని ఆ అభ్యర్ధనను గవర్నర్‌ ఆపడానికి వీలు లేదని హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. పిటీషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. క్యాబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆపడానికి వీలు లేదని శ్రవణ్‌, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆర్టికల్‌ 361 ప్రకారం ఈ పిటిషన్‌ కు అర్హత లేదని గవర్నర్‌ తరుపు కౌన్సిల్‌ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటీషన్‌ మెంటేనబిలిటీ పై విచారణ జరుపుతామని తెలిపింది. తదుపరి విచారణ జనవరి 24 కు వాయిదా వేసింది.

➡️