ఢిల్లీకి సిఎం జగన్‌

Feb 9,2024 08:09 #ap cm jagan, #New Delhi, #paryatana

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. గురువారం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. రాత్రి అక్కడే 1 జన్‌పథ్‌లోని తన నివాసంలో బస చేస్తారు. శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు. ప్రధానికి రాష్ట్ర సమస్యలను నివేదిస్తారని వైసిపి వర్గాలు తెలిపాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అధికార పక్షం వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన పార్టీల అధినాయకులు ఢిల్లీలో బిజెపి పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశమైంది. బుధవారం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కాగా, గురువారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లారు.

➡️