పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Feb 7,2024 16:35 #crime

మారేడ్‌పల్లి: రైలు పట్టాలు దాటి ప్లాట్‌ ఫారం ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్‌ రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దయానంద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటి ఫ్లాట్‌ ఫారం ఎక్కే క్రమంలో రైలు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మఅతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి జేబులో దొరికిన గుర్తింపు కార్డు ఆధారంగా మృతుడి పేరు ఎ.హనుమంతు (38), నిజమాబాద్‌ జిల్లాకు వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

➡️