పాలేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇతర అధికారులు పాల్గన్నారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలపై సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పెండింగ్‌ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌ను తుమ్మల కోరారు.

➡️