పెద్దపల్లిలో కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి

Feb 10,2024 16:45 #dead, #piosion food, #two members

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేటలో విషాదం నెలకొంది. కలుషిత ఆహారం తిని ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులంతా ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికులు. కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను అధికారులు ఆదేశించారు. కార్మికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️