పెనమలూరు నుంచే పోటీ చేస్తా: బోడె ప్రసాద్‌

Mar 14,2024 18:53 #bode prasad, #dhrna, #TDP

ప్రజాశక్తి-పెనమలూరు : పొత్తులల్లో భాగంగా కొందరు టీడీపీ నేతలకు సీట్లు రాకపోవడం, జనసేన అభ్యర్థులు ఖరారు కావడంతో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు టికెట్‌ రాకపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బోడె ప్రసాద్‌కే టికెట్‌ ఇవ్వాలంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించేకునే ప్రయత్నం చేశారు. దీంతో తోటి టీడీపీ కార్యకర్తలు అడ్డుకువడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు తప్ప.. ఎవరు పోటీ చేసినా తాను మాత్రం తప్పనిసరిగా బరిలోకి దిగుతానని చెప్పారు. పార్టీ మారేది లేదని.. కానీ టికెట్‌ కోసం పోరాటం చేస్తానన్నారు. తనకు కాకపోయినా లోకల్‌ నాయకులే పెనమలూరు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

➡️