ప్రముఖ యూట్యూబర్‌ ‘పీకే’ చందు సాయి అరెస్ట్‌!

Dec 15,2023 16:10 #arrested, #you tube star

హైదరాబాద్‌: ప్రముఖ యూట్యూబర్‌ చందు సాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాల ప్రకారం.. నార్సింగికి చెందిన యువతిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఆమెపై అత్యాచారం కూడా చేశాడు. తర్వాత ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. అతనిపై అత్యాచారం, మోసం కేసు నమోదైంది.నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబర్‌ని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే చందు సాయి యూట్యూబ్‌లో బాగా పాపులర్‌. చందు గాడు, పక్కింటి కుర్రాడు లాంటి యూట్యూబ్‌ ఛానెల్స్‌ లో వీడియోలు చేసేవాడు. కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను పనిచేసే యూట్యూబ్‌ ఛానెల్‌లకు మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని పుకార్లు కూడా షికారు చేయడం ప్రారంభించాయి. నెలకు రెండు కోట్లు సంపాదిస్తున్నాడని.. పెద్ద బంగ్లా, పడవ లాంటి కారు ఉందని ప్రచారం జరిగింది.

➡️