ప్రయివేట్‌ బస్సులో భారీ చోరీ

Jan 14,2024 15:23 #Massive theft, #private bus

కంటేశ్వర్‌ :ఓ ప్రయివేట్‌ బస్సులో గుర్తుతెలియని దుండగులు భారీ చోరికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రయివేట్‌ బస్సులో భారీ చోరీ జరగడంతో పోలీసులు తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు.ఈ మేరకు ఉదయం 6 గంటలకు ఓ ప్రైవేట్‌ బస్సు ముంబై నుంచి జగిత్యాల వెళ్తోంది. అయితే ఆ బస్సులో హనుమంతు అనే వ్యక్తి సుమారు 13 లక్షలు తీసుకొని జగిత్యాలకు ప్రేమిస్తున్నాడు. సారంగాపూర్‌ డైరీ ఫార్మ్‌ వద్ద బస్సు ఆపి ప్రయాణికులు చాయి తాగేందుకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు హనుమంతు బ్యాగును అపరించుకొని వెళ్ళాడు. దీంతో బాధితుడు ఆరవ టౌన్‌ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రైవేట్‌ బస్సును టౌన్‌ కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. బస్సులో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. గుర్తుతెలియని దుండగుడు సీసీ కెమెరాకు చెయ్యి పెట్టి దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సిసి ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

➡️