ప్రశాంత్‌ కిషోర్‌ తప్పు తెలుసుకొని బాధపడుతున్నారు: ఆనం వెంకటరమణారెడ్డి

Dec 24,2023 15:25 #press meet, #Tdp Leader

నెల్లూరు: వైయస్‌ఆర్‌ సీఎం కాకముందు ఆయన కుమారుడు జగన్‌ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని టిడిపి నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాకే జగన్‌ ఎదిగారని చెప్పారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడారు. మనమంతా జగన్‌, షర్మిలకు వైయస్‌ఆర్‌ అంటే ఎంతో ప్రేమ అనుకుంటాం.. కానీ, రాజశేఖర్‌ రెడ్డి చనిపోయాక ఆయన కోసం వైఎస్‌ కుటుంబం ఏం చేసింది?అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వైసిపి కోసం పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తప్పు తెలుసుకొని.. ఏపీ సర్వనాశనమైందని బాధపడుతున్నారని ఆనం చెప్పారు.

➡️