బాలుడిపై సామూహిక లైంగిక దాడి

Mar 21,2024 20:40 #boy, #Mass sexual assault

ప్రజాశక్తి – బెల్లం కొండ (పల్నాడు జిల్లా) :బాలుడిపై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన పల్నాడు జిల్లాలో గురువారం వెలుగు చూసింది. మిర్చి కోతల నిమిత్తం బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన కొన్ని కుటుంబాలు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటపాలేనికి ఇటీవల వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం పెద్దవారంతా పనులకు వెళ్లగా 12 ఏళ్ల బాలుడితో పాటు మరో ముగ్గురు ఇంటి వద్దే ఉన్నారు. సాయంత్రానికి బాలుడికి రక్తం వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా విషయం బయటపడింది. వైద్య పరీక్షల నిమిత్తం బాలుడిని సత్తెనపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు బెల్లంకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

➡️