బీసీలకు పదవులు ఇచ్చారు కానీ, అధికారాలు ఏవి..? : ఎమ్మెల్సీ జంగా

Feb 12,2024 15:52 #MLC Janga Kashnamurthy

ప్రజాశక్తి-అమరావతి: బీసీలకు పదవులు ఇచ్చారు కానీ, అధికారాలు ఏవి? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపిలో సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, గౌరవం ఇవ్వడంలేదని, ప్రోటోకాల్‌ పాటించడంలేదని ఆరోపించారు. బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బీసీలు ఇవాళ పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైసీపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని జంగా కష్ణమూర్తి స్పష్టం చేశారు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారని.. రూ.లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు.

➡️