భారత్‌ , ఇంగ్లాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

Jan 24,2024 15:12 #special busses, #tsrtc

హైదరాబాద్‌: క్రికెట్‌ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఇండియా , ఇంగ్లాండ్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మైదానానికి 60 బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ బస్సులు రోజూ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై.. తిరిగి రాత్రి 7 గంటల వరకు స్టేడియం నుంచి బయలుదేరుతాయని తెలిపారు. మ్యాచ్‌ వీక్షించాలనుకొనే క్రికెట్‌ అభిమానులు ఈ ప్రత్యేక బస్సుల సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు.

➡️