మహిళలకు టికెట్‌ కొట్టిన కండక్టర్‌.. తర్వాత ఏమైందంటే..!

Dec 10,2023 16:55 #telangana rtc

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీసి కండక్టర్‌ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్‌ నుంచి బోధన్‌ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్‌ మహిళలకు టికెట్‌ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం ఉందన్న కండక్టర్‌ వినలేదు. ఈ క్రమంలో.. కండక్టర్‌ వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు బాధితులు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ విచారణకు ఆదేశించారు. వెంటనే.. కండక్టర్‌ ను విధుల నుంచి ఆర్‌.ఎం. జాని రెడ్డి తప్పించారు. బోధన్‌ డిపోలో కండక్టర్‌ గా పని చేస్తున్న నర్సింహులుగా గుర్తించారు.కాగా.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నిన్ననే ప్రారంభమైంది. శనివారం సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే.. మహాలక్ష్మి స్కీంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా తమకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ పథకం ద్వారా.. మహిళలు, బాలికలు ట్రాన్స్‌ జెండర్‌లు తెలంగాణ రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణం చేయవచ్చును. అలాగే ఒక వారం పాటు ఏ ఐడీ కార్డు చూపించకుండా వెళ్లచ్చని సీఎం వెల్లడించారు.

➡️