మార్చి 3,4,5 తేదీలో పాలకొల్లులో జాతీయ స్థాయి నాటికల పోటీలు

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : మార్చి 3, 4, 5 తేదీలలో : పాలకొల్లు కళా పరిషత్‌ 15వ జాతీయ స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు.. కళా పరిషత్‌ అద్యక్షులు కె.వి.కృష్ణ వర్మ తెలిపారు. నాటికల పోటీల్లో పాల్గొనే ప్రతి నాటికకు రూ. 15 వేలు ప్రదర్శన పారితోషకం ఇవ్వబడుతుందని, ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు నగదు బహుమతులు అందజేస్తామని వర్మ తెలిపారు. వ్యక్తిగత బహుమతులు, మెమెంటోలు బహుకరించడం జరుగుతుందని గౌరవ అద్యక్షులు మేడికొండ శ్రీనివాస్‌ తెలిపారు. సమావేశం అనంతరం సినీ నిర్మాత బన్నీ వాసుని కలసి పరిషత్‌ కు ఆహ్వానించడం జరిగిందని కార్యదర్శి జక్కంపూడి కుమార్‌ తెలిపారు. సమావేశంలో డా. కె.ఎస్‌.పి.ఎన్‌.వర్మ , విఠాకుల రమణ, మానాపురం సత్యనారాయణ, కొణిజేటి గుప్త, షేక్‌ పీర్‌ సాహెబ్‌, నడపన శ్రీనివాసరావు ,కొల్లి ప్రసాద్‌, సోమంచి శ్రీనివాస శాస్త్రి, అంగర కుమార్‌, రెడ్డి వాసు, జిఎస్‌ఎన్‌.రవి పాల్గొన్నారు.

➡️