రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

Jan 28,2024 16:02 #drugs control officers, #Raids

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. నకిలీ మందుల అమ్మకాలపై నిరంతర దాడులు నిర్వహిస్తున్నారు. మెడికల్‌ షాపుల్లో నాసిరకం మందుల విక్రయాలతో పాటు అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఫలకునుమా, జంగంమెట్‌లోని క్లినిక్‌, మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రూ.1.20 లక్షల విలువైన మందులను సీజ్‌ చేశారు. అలాగే మెదక్‌ జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న క్లినిక్‌ను సీజ్‌ చేశారు.

➡️