రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు: నారా భువనేశ్వరి

Feb 29,2024 15:15 #Nara Bhuvaneshwari, #speech

అనకాపల్లి: టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర అనకాపల్లిలో కొనసాగుతోంది. రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో గురువారం ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మఅతి చెందిన పార్టీ కార్యకర్త సుర్ల దేవుడమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. టిడిపి వారి కుంటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 50 రోజులపాటు యద్ధం జరగబోతోందని, దాన్ని ధైర్యంగా ఎదుర్కొని.. విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళలను హింసించడమే వైసిపి ధ్యేయంగా పెట్టుకుందని ఆరోపించారు.

➡️