రెండు కీలక సైబర్‌ కేసులను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు

Jan 6,2024 14:43 #arrested, #cyber criminals

హైదరాబాద్‌: సైబర్‌ నేరాలకు సంబంధించిన రెండు కీలకమైన కేసులను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. డఫాబెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిందితుడిని హరియాణాకు చెందిన హితేశ్‌ గోయల్‌గా గుర్తించారు. అతడి నుంచి రూ.1.40 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. యూనిటీ స్టాక్స్‌ పేరుతో మోసాలు చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రూ.3.16 కోట్లు నష్టపోయినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. నిందితుడిని రోనక్‌తన్నాగా గుర్తించినట్లు చెప్పారు. ఇతడు దుబారు నుంచి మోసాలకు పాల్పడేవాడని, నిందితుడి బ్యాంక్‌ ఖాతాలోని రూ.20 లక్షలు ఫ్రీజ్‌ చేసినట్లు తెలిపారు. అతడికి సహకరించిన మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశామన్నారు. నిందితుడు 95 బ్యాంక్‌ ఖాతాలు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

➡️