నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Jan 8,2024 08:10 #CPM State Committee, #prakatana

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలు, ప్రభుత్వ వైఖరిని చర్చించేందుకు సిపిఎం ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో జరిగే ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీతోపాటు జనసేన, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, బిఎస్‌పి, వామపక్ష పార్టీల నాయకులు, మేధావులు హాజరుకానున్నారని తెలిపింది. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరింది.

➡️