విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలి

Jan 25,2024 09:44 #Dharna, #VRA
  • ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని విఆర్‌ఎలకు తెలంగాణ తరహాలో పే స్కేల్‌ను, ఉద్యోగోన్నతులను అమలు చేయాలని ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం కోరింది. ఈ మేరకు బుధవారం సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, నాయకులు అహ్మద్‌ సిసిఎల్‌ఎ అదనపు కమిషనరు ఇంతియాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విఆర్‌ఎలకు టిఎ, డిఎలు అమలు చేయాలని కోరారు. అలాగే విఆర్‌ఎల వేతనాల పెంపు సమస్యను పరిష్కరించాలని కోరారు.

➡️