విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నాం : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: తెలంగాణ అభివఅద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో తెలంగాణ స్టేట్‌ ఫైర్‌ సర్వీసెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ప్రపంచంతో ఈ నగరం పోటీ పడుతోందని.. పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు.”గత 30 ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్‌ అభివఅద్ధి కొనసాగింది. ఈ మహా నగరాన్ని అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌గా విభజించి ముందుకు తీసుకెళతాం. అవుటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని 25వేల ఎకరాల్లో హెల్త్‌, స్పోర్ట్స్‌, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేపడతాం. ఫార్మా సిటీలు కాదు.. ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తాం. అపోహలు వద్దు.. మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేదిలేదు” అని రేవంత్‌రెడ్డి అన్నారు.

➡️