వైసిపికి మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి రాజీనామా

Mar 15,2024 17:09 #kavali exmla, #resignation

ప్రజాశక్తి-కావలి (నెల్లూరు జిల్లా):నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసిపికి రాజీనామా చేశారు. నెల్లూరు బాపూజీనగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వైసిపి రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యుడి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో కావలి, ఉదయగిరి వైసిపి అభ్యర్థుల గెలుపునకు కృషి చేశానని చెప్పారు. పార్టీలో ఆత్మాభిమానం చంపుకొని ఉండలేకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, ఇప్పటికి ఏ పార్టీలో చేరాలని అనుకోలేదని చెప్పారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో చర్చించి, ఏ పార్టీలో చేరేదీ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.

➡️