వైసిపిలో చేరిన ముద్రగడ

Mar 15,2024 21:43 #joined YCP, #Mudragada

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. ఆయనతోపాటు కుమారుడు గిరిబాబు కూడా వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసిపి రీజనల్‌ కోాఆర్డినేటర్‌ పివి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గన్నారు. 1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అందులో చేరారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్‌పిగా గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో అన్ని తరగతుల ప్రజలకు మేలు చేస్తున్న సిఎం జగన్‌ మళ్లీ సిఎంను చేసేందుకే తాను వైసిపిలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన మీడియాతో అన్నారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి వైసిపిలో చేరారు.

➡️