సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

తెలంగాణ: తెలంగాణ సర్కార్‌ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది. సంక్రాంతి సెలువులు జనవరి 12న తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.. మరుసటి రోజు రెండో శనివారం, తర్వాత 14 ఆదివారం భోగి పండుగ కాగా.. 15వ తేదీ సోమవారం సంక్రాంతి పర్వదిన వస్తోంది. ఇక, 16వ తేదీన కనుమ పండగ ఉంది.. కాగా, 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్‌ వస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్‌ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. కాగా జనవరి 25న ఆదివారం, 26 రిపబ్లిక్‌ డే వరుస సెలవులు కూడా రాబోతున్నాయి.

➡️