సీఎం రేవంత్‌ రెడ్డిన కలిసిన సీపీఐ నాయకులు

హైదరాబాద్‌ : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సీపీఐ నేతలు కూనంనేని సాంబశివ రావు, నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డి, ఇతర నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు.

➡️