సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వారు నెంబర్‌ ప్లేట్‌ ఛేంజ్‌..!

హైదరాబాద్‌ : తెలంగాణలో శుక్రవారం నుంచి వాహననాల నెంబర్‌ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయడం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వారు కి సైతం అధికారులు నెంబర్‌ ప్లేట్లను మార్చారు. సెక్రటేరియట్‌ లో ముఖ్యమంత్రి వెహికిల్స్‌ కు టీఎస్‌ పేరుతో ఉన్న నెంబర్‌ ప్లేట్లను సెక్యూరిటీ సిబ్బంది తొలగించి వాటి స్థానంలో టీజీ పేరుతో ఉన్న నెంబర్‌ ప్లేట్లను బింగించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్‌ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిందనే కారణంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌ స్థానంలో టీజీ మార్చివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ నెంబర్లు రానున్నాయి. అయితే టీజీ సీరీస్‌ కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వాహనాలకు మాత్రమే తప్పనిసరి చేయగా పాత వాహనాలకు మాత్రం పాత నెంబర్లే కొనసాగనున్నాయి.

➡️