సూర్యాపేటలో భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత

Feb 15,2024 15:20 #ration rice, #seized

సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని సూర్యాపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మీడియాకు వివరాలను వెల్లడించారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల బియ్యాన్ని సూర్యాపేట జనగాం క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి లారీ, మూడు అశోక్‌ లేలాండ్‌ వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. ఎవరైనా బియ్యాన్ని అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, చాకచక్యంగా నింది తులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

➡️