హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటు: డిప్యూటీ సీఎం

Mar 2,2024 14:42 #bhatti vikramarka, #press meet

హైదరాబాద్‌: హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాదును మిగతా జిల్లాలతో కలుపుతూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. హైటెక్‌ సిటీ లోని ప్రైవేట్‌ హౌటల్లో జరిగిన సిఐఐ తెలంగాణ స్టేట్‌ అన్యువల్‌ మీటింగ్‌ 2023-24 కాన్ఫరెన్స్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులుపెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధతగా ఉన్నదని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుంది. తెలంగాణలోని మహిళలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి గా చూస్తున్నదని వివరించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల అమలులో మహాలక్ష్మి పథకం కింద మహిళల అందిస్తున్న ఉచిత బస్సు రవాణాను ఇప్పటి వరకు 18.50 కోట్ల మంది మహిళలకు జీరో టికెట్స్‌ ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కొత్త ఇండిస్టీ పార్కుల ఏర్పాటుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తున్నామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.

➡️