ఎర్ర చెరువుకు 25 క్యూసెక్కుల తాగు నీరు విడుదల

మైదుకూరు (కడప) : మైదుకూరు ఎర్రచెరువుకు ఎస్‌ ఆర్‌ 1 నుండి శాశ్వత జి ఓ మేరకు కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం తెలుగు గంగ అధికారులు తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. మంగళవారం ఎస్‌ ఆర్‌ 2 నుండి 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మైదుకూరు ప్రజల దాహార్తి తీరనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో ఎర్ర చెరువు నిండనుందని అధికారులు చెబుతున్నారు.

➡️