రూ.27 లక్షల బంగారు ఆభరణాలు సీజ్‌

Apr 6,2024 00:26 #2024 elections, #gold sized

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వాహనాల తనిఖీలో రూ.27 లక్షలు విలువైన బంగారు ఆభరణా లను సీజ్‌ చేసినట్లు డిఎస్‌పి మురళీధర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు టూ టౌన్‌ సిఐ అబ్దుల్‌ కరీం, ఎస్‌ఐ రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఆర్‌టిసి బస్టాం డ్‌ వద్ద శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌కు చెంది న రాజారామ్‌ కరుప్పుస్వామి కారును పరిశీలిం చగా రూ.27 లక్షల విలువైన 400 గ్రామాలు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి.

➡️