3 నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌

Feb 6,2024 13:25 #hydrabad, #KCR
  •  ఘన స్వాగతం పలికి నేతలు

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు వచ్చారు. తుంటి గాయం కారణంగా మూడు నెలలుగా ఫామ్‌ హౌస్‌లోనే రెస్ట్‌ తీసుకున్న కేసీఆర్‌.. గాయం నయం కావడంతో తిరిగి ఇవాళ కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు వచ్చారు. దీంతో పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. మహిళా నేతలు కేసిఆర్‌కు మంగళహరతులతో ఘన స్వాగతం పలికారు. గుమ్మడి కాయలు, నిమ్మకాయలతో అధినేతకు దిష్టి తీశారు. కేసీఆర్‌ జిందాబాద్‌, కేసీఆర్‌ సీఎం అంటూ బీఆర్‌ఎస్‌ నేతల నినాదాలతో తెలంగాణ భవన్‌ దద్దరిల్లింది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌ తొలుత భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం, జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్యులతో సమావేశమైవయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

➡️