విద్యుత్‌ సంస్థలకు 3 అవార్డులు.. సిఎం అభినందనలు

Jan 1,2024 20:30 #ap cm jagan, #AP Education, #Awards
cm jagan visit srikakulam

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఫాల్కన్‌ మీడియా అండ్‌ ఎనర్షియా ఫౌండేషన్‌ నిర్వహించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు మూడు అవార్డులు సాధించాయి. సాధించిన అవార్డులతో విద్యుత్‌శాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం కలిశారు. ఈ అవార్డుల గురించి ముఖ్యమంత్రికి ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ వివరించారు. క్లీన్‌, గ్రీన్‌ పునరుత్పాదక శక్తి ద్వారా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు, విద్యుత్‌ రంగంలో మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నందుకు ఈ అవార్డులు వచ్చాయని తెలిపారు. విద్యుత్‌, మౌలిక సదుపాయాలు కలిగి ఉండటంలో ట్రాన్స్‌కోకు అవార్డు లభించిందన్నారు. పునరుత్పాదక విద్యుత్‌లో దేశంలో టాప్‌ నోడల్‌ ఏజెన్సీగా ఉన్నందుకు, అదే విధంగా పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను ప్రచారం చేయడంలో ఎపి నెడ్‌క్యాప్‌ ఉత్తమంగా ఉన్నందుకు అవార్డు పొందిందని తెలిపారు. ఈ అవార్డులు సాధించినందుకు అధికారులను అభినందించారు. రాష్ట్ర విద్యుత్‌ రంగాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపాలని జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో ఎమ్‌డి కెవిఎన్‌ చక్రధర్‌ బాబు, ట్రాన్స్‌కో జెఎమ్‌డి బి మల్లారెడ్డి, గ్రిడ్‌ డైరెక్టర్‌ ఎకెవి భాస్కర్‌, ఇంధనశాఖ జాయింట్‌ సెక్రటరీ బిఎవిపి కుమార్‌ రెడ్డి, నెడ్‌క్యాప్‌ ఎమ్‌డి రమణా రెడ్డి పాల్గొన్నారు.

➡️