5 కి.మీ. డోలీపై మోసుకొని వెళ్లడం దురదృష్టకరం: చంద్రబాబు

Jan 17,2024 15:45 #Chandrababu Naidu, #press meet

అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని వెళ్లడం దురదృష్టకరమని.. ఇలాంటి దుస్థితి రాకూడదనే గతంలో ఫీడర్‌ అంబులెన్సులు తీసుకొచ్చినట్లు చెప్పారు. వాటిని పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.”తల్లి, బిడ్డ చనిపోయేందుకు కారణం ప్రభుత్వ అలసత్వం కాదా? కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కని.. ఘటనపై విచారణ జరిపించాలి. చిట్టంపాడు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని చంద్రబాబు తెలిపారు.

➡️