Textile Park సమగ్ర అభివృద్ధికి చర్యలు : సిఎం రేవంత్‌ రెడ్డి

Jun 29,2024 16:23 #CM Revanth Reddy, #Telangana
revanth reddy as ts cm oath

వరంగల్‌ : టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రాంతాన్ని తాము ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సిఎం రేవంత్‌ రెడ్డి శనివారం వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేటలలో పర్యటించారు. వనమహౌత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్‌ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం కైటెక్స్‌, యంగ్‌వన్‌ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. టెక్స్‌టైల్‌ కోసం భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సమీపంలో వరద నీటిని స్టోర్ చేసేలా పది ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెక్స్‌టైల్ పార్కుకు సమీపంలో వచ్చే వరద నీటిని ఈ చెరువులోకి మళ్లించి వాటిని స్టోర్ చేయాలని సూచించారు. ఈ చెరువును స్థానికంగా ఉండే ఇతర చెరువులతో లింక్ చేయడం ద్వారా వరద నీటికి పరిష్కారంతో పాటు టెక్స్‌టైల్‌ పార్క్‌కు అవసరమైన నీటి లభ్యతను సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు.

➡️