టైరు పేలి మరో కారును డీకొన్న కారు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

Jan 2,2024 16:05 #devarapalli, #road accident

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కారు టైరు పేలి డివైడర్‌ అవతలి వైపు వెళ్తోన్న మరో కారును డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్తోన్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు.

➡️