సాక్షి విలేకరి దామోదర్‌ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి : ఎపిడబ్ల్యుజెఎఫ్‌

అమరావతి : సాక్షి విలేకరి దామోదర్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపటం అవసరమని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ప్రభుత్వాన్ని కోరింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సాక్షి విలేకరి దామోదర్‌ ఆత్మహత్య పట్ల ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శనివారం ఉదయం ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు ఓ ప్రకటనను విడుదల చేశారు. దామోదర్‌ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ సాక్షి విలేకరి దామోదర్‌ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపటం అవసరమని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ భావిస్తోందన్నారు. ఇటీవల కాలంలో తెలుగు నాట సంభవిస్తున్న వివిధ సంఘటనల్లో జర్నలిస్టులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారిందని, ఈ పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించటం తక్షణ కర్తవ్యంగా ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోందన్నారు. లావేరు విలేకరి ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి ఫెడరేషన్‌ విజ్ఞప్తి చేస్తున్నదన్నారు.

➡️