ప్రకాశంలో ఘోర ప్రమాదం

Dec 23,2023 09:05 #prakasam, #road accident

– ఆటోను కారు డీ కొనడంతో నలుగురు మృతి

– ఐదుగురికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తిాపెద్దారవీడు (ప్రకాశం జిల్లా)ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢ కొన్నడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామ సమీపంలోనిశుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..గుంటూరుకు చెందిన రాయ వెంకటేశ్వరరావు (52), రాయ నాగేశ్వరరావు (48) తమ బంధువుల గృహ ప్రవేశానికి ప్రకాశం జిల్లా కొమరోలుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దేవరాజుగట్టు వద్ద ప్లై ఓవర్‌ బ్రిడ్జి దిగే క్రమంలో ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద కారు అదుపు తప్పింది. అదే సమయంలో త్రిపురాంతకం వైపు నుంచి మార్కాపురం వైపు వెళుతున్న ఆటోను ఢకొీంది. కారు వేగం అదుపు కాకపోవడంతో 100 మీటర్ల మేర ఆటోను నెట్టుకుంటూ వెళ్లింది. ఇనుప హోర్డింగ్‌ పోల్స్‌ను ఢకొీన్ని కారు ఆగిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురం పట్టణం పూలసుబ్బయ్య కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అబిద్దాషాన్‌ (బాబు) (46), త్రిపురాంతకం మండలంలోని దూపాడు గ్రామానికి చెందిన ఎనిబెర అభినరు (12) మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించారు. ఆటో ప్రయాణికులు పెద్దదోర్నాల మండలంలోని గంటవానిపల్లె గ్రామానికి చెందిన ఉప్పలపాటి దానియేలు, దూపాడుకు చెందిన ఎనిబెర రత్నతేజ, కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు మండలంలోని మంగళగిరి కాలనీకి చెందిన ఎల్లూరి మైథిలి, బేతంచెర్లకు చెందిన షేక్‌ ముసీదా తీవ్రంగా గాయపడ్డారు. మరో విద్యార్థి కలీద్‌ కమెరన్‌ గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. గాయపడిన వారందరికీ కాళ్లు, చేతులు విరిగాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్రిస్మస్‌కు కొత్త దుస్తుల కోసమని.. త్రిపురాంతకం మండలంలోని దూపాడు గ్రామానికి చెందిన ఎనిబెర చిన్న గురవయ్య, ఉమా దంపతులకు అభినరు, రత్నతేజ ఇద్దరు కుమారులు. క్రిస్మస్‌ వేడుకలో కొత్త దుస్తుల కోసం దూపాడు నుంచి మార్కాపురానికి అన్నదమ్ములు ఇద్దరూ ఆటోలో బయలుదేరారు. అభినరు చనిపోగా రత్నతేజ తీవ్రంగా గాయపడ్డారు.

➡️