కానిస్టేబుల్‌ ప్రాణం తీసిన భారీ గుంత

ప్రజాశక్తి- పాలకొండ (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. కానిస్టేబుల్‌ సురేష్‌ స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం పాలకొండకు వెళ్తుండగా.. గుంతను తప్పించబోయి అదుపుతప్పి బైక్‌ మీద నుంచి కిందపడ్డాడు. దాంతో అతడి తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇదే రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️