అల్లూరిలో వాన – మూడు షాపులపై కూలిన చెట్టు

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : అల్లూరి జిల్లాలో ఆదివారం కురిసిన వర్షానికి మూడు షాపులపై చెట్టు కూలింది. ఆదివారం ఈదురు గాలులతో కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలో మటన్‌ షాప్‌, టైలర్‌ షాపు, టీ పాయింట్‌ షాపులపై చెట్టు విరిగిపడింది. దీంతో మూడు దుకాణాలు నుజ్జునుజ్జయ్యాయి. మూడు దుకాణాలకు నష్టం కలిగింది. మూడు షాపుల్లో ఉన్నవారంతా వెంటనే బయటకు పరుగులు తీశారు. ఎవరికీ ప్రాణ నష్టం లేకపోవటంతో మండలవాసులు ఊపిరిపీల్చుకున్నారు. మూడు దుకాణాలకు ప్రభుత్వం నష్టం పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.

➡️