Delhi liquor case: అభిషేక్‌ బోయినపల్లికి బెయిల్‌

హైదరాబాద్‌ : ఢిల్లీ లిక్కర్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లికి బెయిల్‌ మంజూరైంది. ఐదు వారాల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉండటంతో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ట్రయల్‌ కోర్టు అనుమతితోనే హైదరాబాద్‌ వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 29కి వాయిదా వేసింది.

➡️