కడప తహశీల్దార్‌ ఇంట్లో ఎసిబి సోదాలు

Mar 30,2024 22:11 #ACB RIDS, #tirupathi

– పలు పత్రాలు, నగదు స్వాధీనం
ప్రజాశక్తి-తిరుపతి సిటీ :కడప తహశీల్దారు శివప్రసాద్‌ ఇంట్లో ఎసిబి అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బెంగళూరు, కడప, తిరుపతి, రేణిగుంటలోని తహశీల్దారు ఇళ్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. పలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందడంతో నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసంలో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు, బెంగళూరులో భారీ స్థాయిలో నగదును పట్టుకున్నట్లు సమాచారం. గతంలో ఆయన రేణిగుంట తహశీల్దార్‌గా విధులు నిర్వహించారు.

➡️