నిలకడగా తమ్మినేని ఆరోగ్యం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌

తెలంగాణ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్‌ సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు.. ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రసుత్తం ఆయనకు ఐసియులో వెంటిలేటర్‌ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్‌కి తమ్మినేని రెస్పాండ్‌ అవుతున్నారని, ఆరోగ్యం కుదటపడితే వెంటిలేటర్‌ తొలగించే అవకాశం ఉంటుందని వైద్యులు వెల్లడించారు. డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ డీఎన్‌ కుమార్‌ల పర్యవేక్షణలో క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు చెందిన నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పల్మనాలజిస్టులతో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తోంది.’ అని ఎఐజి ఆస్పత్రి పేర్కొంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో పాటు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

➡️