రైతు వెన్ను విరిచారు

aiks national council meeting preparations

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు వెన్నును పాలకులు విరిచారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. శనివారం స్థానిక కార్మిక కర్షక భవన్లో ఏపీ రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్.శంకర్ శర్మ మాట్లాడుతూ రైతులను గురించి మాట్లాడే అవకాశం లభించినందుకు తాను ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎక్కువ శాతం సన్న కారు చిన్న కారు కవులు రైతులే వ్యవసాయాన్ని చేస్తున్నారని చెప్పారు. రైతుకు ఆదుకునేందుకు ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలా నిధులు, ప్రాజెక్టులో నిర్మించకుండా రైతులు వలసలు వెళ్లే విధంగా, రైతులు ఆకలి చావులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేస్తున్నారని దుయ్యబట్టారు. అతివృష్టి, అనావృష్టికి తోడుగా రైతుకు పంటలకు పెట్టుబడులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర, రవాణా, మార్కెట్ లాంటి కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ఆదుకోకపోవడం వల్లనే ప్రకృతి వైపరీత్యాల వల్ల సన్నా, చిన్నకారు రైతులు కౌలు రైతులు పెట్టుబడులు పెట్టినవి కూడా రాక పంటలకు చేసిన అప్పులు పేరిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రైతుకు విద్య లేకపోవడంతో వ్యవసాయం ఎలా చేయాలో తెలియక, ప్రభుత్వ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనే విషయాలను అవగాహన లేకపోవడం వల్లనే అప్పులలో కూరుకొని పోతున్నారన్నారు. రైతులకు అనుబంధ ముగా ఉండే పాడి పరిశ్రమతో పాటు, కోళ్ల పరిశ్రమ, పొట్టేళ్ల పరిశ్రమ, చేపల పరిశ్రమ లాంటి ఎన్నో అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా వారికి ప్రభుత్వం తోడ్పాటును అందించాలి అన్నారు. రైతు నకిలీ విత్తనాలు మొదలుకొని రసానిక ఎరువులు క్రిమిసంహారక మందులు అన్నీ కల్తీతో రైతులను నష్టాలు పాలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు ఏ నేలలో ఎలాంటి పంటలు పండించాలి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు లాంటివన్నీ అవగాహన కల్పించి సబ్సిడీలు అందించి వారిని ప్రోత్సహించినప్పుడే అందరికీ అన్నం పెట్టే రైతును ఆదుకున్నట్లు అవుతుందన్నారు. సమతుల్యతను గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోవడం వల్లనే నేల సాంద్రతకి, క్రిమిసంహారక మందుల ప్రభావం వల్ల భూమి, ఆహారము, నీరు అన్ని కలుషితమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు సబ్సిడీలను, మార్కెట్ సౌకర్యం కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు ఇచ్చే సబ్సిడీలు అన్నింటిని రైతులకు అందించి హార్టికల్చర్ ను కూడా అభివృద్ధి చేయాలని తెలియజేశారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో జరుగు జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేసేందుకు అందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల కన్వీనర్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ మూడవ తేదీ జిల్లా పరిషత్ లో మీటింగ్ హాల్లో జరుగు రాష్ట్ర సదస్సుకు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షత వహిస్తారని, ఏఐకే అఖిలభారత ఉపాధ్యక్షులు సి సాగర్, మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే.శోభనాద్రిశ్వరరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ. దశరథరామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డిలు పాల్గొంటారని అన్నారు. కావున రైతు సోదరులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి సాధారణ భీమా రంగం రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ రైతుల సమస్యలు సృష్టించి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని తెలియజేశారు. ఇన్సూరెన్స్ ద్వారా రైతులను ఎలా ఆదుకోవాలోతెలియజేసే విధంగా ఈనెల 10వ తేదీన రైతు కవనం అనే కవితా సదస్సును ఏర్పాటు చేస్తున్నామని అందు రైతుల కష్టాలను గురించి వివరించే విధంగా రైతు కవనం ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ఆహ్వాన సంఘం నాయకులు టి.నరసింహ పాల్గొన్నారు.

➡️