ఆశలన్నీ అప్పులపైనే..

Feb 8,2024 08:58 #AP Debts
ap debts
  • రూ.రుణ వాయిదాలకే రూ.21 వేల కోట్లు
  • కేంద్ర నిధులపైనా ఆశలు గల్లంతు 
  • ద్రవ్యలోటు కూడా రూ.50 వేల కోట్లకుపైనే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ కొత్త బడ్జెట్‌లో ఆదాయ వనరుల సమీకరణను చూపించడంలో అస్పష్టత నెలకొంది. కేవలం కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులు, సొంత పన్నులు, రుణాలు వంటి వాటిపైనే ఎక్కువ ఆధారపడినట్లు కనిపించింది. ఎంతగా వ్యయాన్ని తగ్గించి చూపిరచాలనుకున్నా సాధ్యం కాని పరిస్థితి నేపథ్యంలో లోటు కూడా భారీగానే ఉంటుందని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అరగీకరిరచాల్సి వచ్చిరది. చివరకు సంక్షేమానికి కూడా నిధులను గణనీయంగా తగ్గించడం గమనార్హం. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్‌ మొత్తాన్ని తక్కువ వృద్ధితో ప్రతిపాదించింది. బుధవారం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో అంతా గణాంకాల గారడీగానే అభివర్ణిరచాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ఇతర శాఖల అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది రూ.2,79,279 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించగా, ఈ ఏడాది మాత్రం గతంలో లేనంత స్వల్ప వృద్ధితో రూ.2,86,389 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించడం గమనార్హం. గతేడాది కన్నా కేవలం రూ.7,120 కోట్లు మాత్రమే పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన ఆదాయం కన్నా చివరకు వచ్చిన ఆదాయం తక్కువగానే రికార్డయిన కారణంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో గతేడాది కంటే కొద్దిగా ఆదాయాన్ని తగ్గించి చూపించింది. రాష్ట్ర పన్నుల ద్వారా ఈ ఏడాది రూ.95,756 కోట్లు వస్తుందని తేల్చగా, కొత్త సంవత్సరంలో ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా వస్తుందని పేర్కొన్నారు. పన్నేతర ఆదాయం కూడా మరో నాలుగు వేల కోట్లు ఎక్కువగా వస్తురదని చెబుతున్నారు. ఏయే కోణాల్లో ఈ ఆదాయం వస్తుందన్నది అస్పష్టంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.

  • గ్రారట్లపై ఆశల్లేవు

కేంద్రం ఇచ్చే నిధులపై ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆశలు పెట్టుకుంటాయి. తాజా బడ్జెట్‌లో మాత్రం ఈ గ్రారట్లపై ఆశలు లేవన్నట్లుగానే ఆర్థికశాఖ ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.46,834 కోట్లు కేంద్రం నురచి వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదిరచగా, కేవలం రూ.45,803 కోట్లు వస్తున్నట్లు తేల్చారు. 2024-25 ప్రతిపాదనల్లో ఈ గ్రారట్లు రూ.32,127 కోట్లు మాత్రమే వస్తాయని ప్రతిపాదిరచడం గమనార్హం. గతేడాది కన్నా ఏకంగా రూ.13 వేల కోట్లకుపైగా కేంద్రం నురచి నిధులు తగ్గుతాయన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోరది.

  • భారీ రుణాలపైనే మళ్లీ ఆశలు

ఆదాయ మార్గాలు పెరగకపోవడంతో కొత్త ఏడాది కూడా రుణాలపైనే ఆధారపడాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిరది. బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా రూ.70 వేల కోట్లు సమీకరించాలని నిర్ణయిరచిరది. గతేడాది రూ.63 వేల కోట్లు సేకరిరచాలని నిర్ణయిరచగా, వార్షికారతానికి రూ.69 వేల కోట్లు సేకరించినట్లు ప్రభుత్వం పేర్కొరది. ఇప్పుడు రూ.70 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదిరచగా, 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరిరతగా పెరిగే పరిస్థితి ఉరటురదని ఆర్థికశాఖ చెబుతోంది. అలాగే కేరద్రం నురచి వచ్చే, ఇతర రుణాలను కలిపి మరో రూ.8,600 కోట్ల వరకు వస్తాయని తాజా బడ్జెట్‌లో ప్రతిపాదిరచింది. మొత్తం రుణాలు రూ.79,664 కోట్లకు చేరుకుంటాయని పేర్కొంది.

  • సంక్షేమానికి కత్తెర

సంక్షేమమే తమ విధానం అరటూ చెబుతున్న ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో భారీ కోతలు విధించినట్లు కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.51,346 కోట్ల వరకు ప్రతిపాదించగా, ఆ నిధులను దాదాపు ఖర్చు చేసినట్లు ఆర్థికశాఖ చూపించింది. తాజాగా ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఈ నిధులను కేవలం రూ.44,669 కోట్లకు కుదిరచడం గమనార్హం. అంటే ఈ సంక్షేమానికి గతేడాది కంటే రూ.6,799 కోట్ల వరకు తక్కువగా ఉన్నట్లు తేలింది. లోటు కూడా గణనీయంగానే ఉంటుందని కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదిరచారు. గతేడాది ద్రవ్యలోటు రూ.54,587 కోట్లు ఉంటుందని ప్రతిపాదిరచగా, చివరికి రూ.60 వేల కోట్ల వరకు చేరుకున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం కొత్త ఏడాదిలో ఈ లోటు రూ.55,817 కోట్లు ఉంటుందని ప్రతిపాదించింది. ఆదాయ లోటు కూడా రూ.24,758 కోట్లు ఉంటుందని పేర్కొంది.

➡️