అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ – ప్రజల కోసం ప్రభుత్వ-ప్రైవేటు బస్సులు

Jan 19,2024 09:50 #BR Ambedkar, #buses, #statue

విజయవాడ : విజయవాడ బందర్‌ రోడ్డులోని స్వరాజ్య మైదానంలో శుక్రవారం ప్రారంభించనున్న అంబేద్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సన్నాహలు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలను బస్సుల్లో తరలించే ఏర్పాట్లను ఆయా నియోజకవర్గ నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తెనాలి నుంచి 55 ప్రైవేట్‌ బస్సులను, 26 ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు కేటాయించినట్లు సమాచారం ఉంది. ఇప్పటికే పలుగ్రామాల్లో ప్రజలను తరలించడానికి బస్సులను సిద్ధం చేశారు.

➡️