సమ్మె విచ్ఛినానికి నోటీసులు

anganwadi strike 31day in gnt

– అంగన్‌వాడీలు ఇళ్ల వద్ద లేకుంటే కుటుంబసభ్యులకు అందజేత

– కోటి సంతకాల సేకరణ : రమాదేవి

– సమస్యలు పరిష్కరించకపోతే రాజకీయ పోరు : శ్రీనివాసరావు

ప్రజాశక్తి – యంత్రాంగం:సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్న అంగన్‌వాడీలకు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తూ సమ్మెను విచ్ఛినం చేసేందుకు యత్నిస్తున్నారు. నోటీసులకు తలగ్గొది లేదని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ సమ్మెను కొనసాగిస్తామని అంగన్‌వాడీలు తేల్చి చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం అంగన్‌వాడీల కుటుంబసభ్యులకు, వారు లేకపోతే ఇంటి ఆవరణలోని తలుపులకు నోటీసులు తగిలించి వెళుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారు చేపట్టిన సమ్మె గురువారంతో 31వ రోజుకు చేరుకుంది. చెవ్వులో పూలుపెట్టుకుని, ఒంటికాలిపై నిలబడి, కుర్చీలు నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారుగుంటూరు జిల్లా మంగళగిరిలో సమ్మె శిబిరం నుంచి ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. అంగన్‌వాడీలను బెదిరించే అధికారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్మాను అమలు చేసిన అన్ని ప్రభుత్వాలను ఉద్యోగులు ఇంటికి పంపించారని గుర్తు చేశారు. కోటి సంతకాలు సేకరించి మహిళల సంక్షేమ అధికారికి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సిపిఐ ప్రజాపోరు, బహుజన సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సందర్శించి, మాట్లాడారు. అంగన్‌వాడీల నిరవధిక సమ్మె రాజకీయ పోరాటంగా మారకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కని సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పండగ అనంతరం ఈ ఉద్యమం రాజకీయ రూపం తీసుకుంటుందని హెచ్చరించారు. అంగన్‌వాడీల్లో నూటికి 90 శాతం దళిత, బలహీన వర్గాల మహిళలేనని, ఆ మహిళలను తక్కువ అంచనా వేస్తే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు రాసిన లేఖపై ఆయన సంతకం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం తదితరులు పాల్గన్నారు.విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సందర్శించి మద్దతు తెలిపారు. నెల రోజులుగా సమ్మె చేస్తుంటే వారి డిమాండ్లను నెరవేర్చాల్సిందిపోయి నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడలో చెవిలో పువ్వులు పెట్టుకొని, సబ్బవరం, మునగపాక, నక్కపల్లి కేంద్రాల్లో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. అల్లూరి జిల్లాలోని విఆర్‌.పురం, రంపచోడవరం కేంద్రాల్లో నిరాహార దీక్షలు కొనసాగాయి. బాపట్ల జిల్లా మార్టూరులో, ప్రకాశం జిల్లా మార్కాపురంలో పలువురు అంగన్‌వాడీల ఇళ్లకు షోకాజ్‌ నోటీసులు తగిలించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో షోకాజ్‌ నోటీసులను దగ్ధం చేశారు.తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం దీక్షా శిబిరం వద్ద 31 అంకె రూపంలో కూర్చొని నిరసన తెలిపారు. నాయుడుపేటలో ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట భిక్షాటన చేశారు. శ్రీకాకుళంలో జ్యోతిరావు పూలే పార్కు వద్ద 24గంటల నిరాహార దీక్షను కొనసాగించారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో కుర్చీలు నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు. బబ్బిలిలో సమ్మె శిబిరం వద్దకు ప్రభుత్వం పంపిన నోటీసులు పట్టుకొని పోస్టుమ్యాన్లు రావడంతో అంగన్‌వాడీలంతా నిరాకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో చెంపలు వేసుకొని జగన్‌ను అవనసంగా గెలిపించామంటూ నిరసన తెలిపారు.కర్నూలు ధర్నా చౌక్‌ వద్ద, నంద్యాల, నెల్లూరులో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.కాకినాడలో ఆశావర్కర్లు, అమలాపురంలో సిఐటియు నాయకులు హాజరై మద్దతు తెలిపారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో అంగన్‌వాడీ కేంద్రాలకు అధికారులు నోటీసులు అంటించారు.

 

 

 

anganwadi workers strike 31day in knl minister

కేంద్రమంత్రికి అంగన్వాడీల ఫిర్యాదు

కర్నూల్ జిల్లా : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎస్పి సింగ్ బగెల్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో కలవడం జరిగింది. తన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వము ఘోరంగా విఫలం అయిందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారని కేంద్రమంత్రికి తెలిపారు. ధర్నాలు ఆందోళనలు చేసి నెల కావస్తున్నా ప్రభుత్వము పట్టించుకోవడంలేదని కేంద్రమంత్రికి పేర్కొన్నారు.

anganwadi workers strike 31day in tpt

  • అంగన్వాడీల కు న్యాయం చేయకపోతే అధోగతే : కందారపు మురళి 
     

తిరుపతి జిల్లా గూడూరులో అంగన్వాడి కార్యకర్తలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 31 వ రోజుకు చేరుకుంది. జిల్లా సి.ఐ.టి.యు. ప్రధాన కార్యదర్శి కందారపు మురళి శిబిరం వద్దకు చేరుకొని అంగన్వాడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అధోగతి పడుతుందని ఆయన హెచ్చరించడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులో 31 వ రోజు చేరుకున్న పట్టణంలో అంగన్వాడీలు చేస్తున్న నిరాహార దీక్షలు సందర్శించి వారిని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రజల పట్ల అమానవియంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. మహిళన్న వివక్షణ అన్న మర్చిపోయి అంగన్వాడీలపై “ఏ స్మా” ప్రవేశపెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. తక్షణం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుంటే జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటుoదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 33 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 56వేల సెంటర్లో లక్ష అయిదు వేల మంది, అంగన్వాడి సిబ్బంది వీధిలో ఉండి పోరాడుతుంటే ముఖ్యమంత్రి పెదవి విప్పకపోవడం దారుణమని ఆయన అన్నారు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరడమే అంగన్వాడీలు అన్యాయమా అని ఆయన ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్లు పి.డి.లు ద్వారా సి.డి.పి.ఓ.లు వేధింపులకు గురి చేస్తున్నారని, బెదిరింపులు పూను కొంటున్నారని, అంగన్వాడిలు వీటిని ఎదుర్కొంటారని ఆయన అన్నారు, గూడూరు అంగన్వాడీల పోరాట పటిమను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జి.బాల సుబ్రహ్మణ్యం,అంగన్వాడి అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతి, కార్యదర్శి బి.యస్.ప్రభావతి,రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్, గూడూరు పట్టణ సీ.ఐ.టి.యు.అధ్యక్షులు బి.వి.రమణయ్య, కార్యదర్శి ఎస్.సురేష్, మున్సిపల్ జిల్లా కార్యదర్శి బి.గోపీనాథ్,అర్.శ్రీనివాసులు, గుర్రం రమణయ్య, బి.చంద్రయ్య, ఏ.ప్రసాద్, సుబ్బయ్య, సెక్టార్ లీడర్స్ పేంచలమ్మ, మునికుమారి, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

ramadevi on anganwadi strike 31day

  • బెదిరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి

గుంటూరు జిల్లా-మంగళగిరి : అంగన్వాడీలను బెదిరించే అధికారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. మంగళగిరి ఐసిడిఎస్ పరిధిలో సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లను, హెల్పర్లను సూపర్వైజర్లు బెదిరించడాన్ని నిరసిస్తూ గురువారం మంగళగిరి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 31 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. సూపర్వైజర్ల బెదిరింపులు, మహిళా పోలీసులు నోటీసులు అందజేసే విధానం, ఉద్యోగాలు తీసేస్తామని చెప్పడం ఈ చర్యలకు నిరసనగా అంబేద్కర్ సెంటర్లో గల నిరవధిక సమ్మె శిబిరం నుండి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ కొన్ని చోట్ల సిడిపిఓ, సూపర్వైజర్లు అంగన్వాడీలను బెదిరింపు మాటలు మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చమని ఆందోళన చేస్తుంటే అంగన్వాడీల పట్ల ప్రభుత్వ విధానం నిరంకుశంగా ఉందని అన్నారు. ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం దారుణమని అన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్మా చట్టాన్ని అమలు చేసిన అన్ని ప్రభుత్వాలను ఉద్యోగులు ఇంటికి పంపించారని అన్నారు. అంగన్వాడీలు లక్ష కుటుంబాలు ఉంటే వారికి అండగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయని అన్నారు. కోటి సంతకాలు సేకరించి మహిళల సంక్షేమ అధికారికి వినతిపత్రం అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీలు రోజు సమ్మె శిబిరంలో పాల్గొనే కంటే తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంగన్వాడీలు చెబుతున్నారని అన్నారు. వీరికి తోడు కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, అందరూ ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం దిగివస్తుందని అన్నారు. సారా ఉద్యమం కూడా మహిళలు చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉందని అన్నారు. కనీస వేతనం అమలు చేయమని అంగన్వాడీలు కోరుతుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ 31 రోజులుగా తమ న్యాయమైన కోరికలను పరిష్కరించమని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమైన అన్నారు. ఆ చట్టం అంగన్వాడీలకు వర్తించదని అన్నారు. అంగన్వాడీలకు షోకాస్ నోటీసులు ఇచ్చే సూపర్వైజర్లు బెదిరింపులు చేస్తున్నారని విమర్శించారు. ఈ విధంగానే బెదిరింపులు చేస్తే రానున్న రోజుల్లో వాళ్ళ ఇళ్ళ ముందు ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు. బెదిరింపులు చేసిన అధికారులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు వేముల దుర్గారావు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తున్నారని, కష్టపడి చేసిన పని చేసే అంగన్వాడీలకు వేతనాలు పెంచమంటే పెంచడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఏసీ డీవో సరళాకు వినతిపత్రం అందజేశారు. బెదిరింపు చేసిన సూపర్వైజర్లు గురించి తనకు తెలియదని, అలా చేసిన వారి పట్ల పై అధికారులకు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై కమలాకర్, బి వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు టి వెంకటయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు హేమలత, మేరీ రోజమ్మ, సుజాత, ఫాతిమా, భూలక్ష్మి, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ధర్నాలో మహిళా సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న మాసపత్రిక ఈనెల పత్రికను చైతన్య మానవి పుస్తకాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి ఆవిష్కరించారు.

anganwadi workers strike 31day in vzm

విజయనగరం జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగే చర్చల్లో అంగనవాడి సమ్మెను పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.రామ్మూర్తి నాయుడు రాజాం తాసిల్దార్ కార్యాలయం వద్ద 31 వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తూ డిమాండ్ చేశారు.
రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మూడు దపాల చర్చలు జరిపినప్పటికీ అంగన్వాడీలకి ఏ రకమైనటువంటి న్యాయం చేసే పరిస్థితిలో చర్చలు లేవని, నేటికీ 31 రోజులుగా అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం చేస్తున్న నిర్బంధాన్ని తట్టుకొని సమ్మెలో పాల్గొంటే ఇది చూడలేని ప్రభుత్వం ఎస్ మా పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తూ అంగన్వాడీలకు షోకాస్ నోటీసులను అంగనవాడి కేంద్రాలకు కార్యకర్తల ఇంటిలకు అంటించడం సరైనది కాదని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను భయపెట్టాలని చూసి బంగపాటు గురి కావద్దని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే చర్చల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అంగీకరించి అమలు చేసే విధంగా ఉండాలని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని తెలిపారు. ఈ దీక్షలో యూనియన్ నాయకులు బి ఉమా కుమారి, సునీత, భారతి, చిన్నముడు, మంగమ్మ, వనజ ,పార్వతి, ఈశ్వరమ్మ, ఉమా, కాళీరత్నం, పుణ్యవతి, విజయ్ కుమారి మొదలగువారు పాల్గొన్నారు.

anganwadi workers strike 31day in eg

31 వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె

తూర్పు గోదావరి జిల్లా-నల్లజర్ల  : గురువారం నాటికి 31 వ. రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోగా సమ్మెలో కొనసాగుతున్న అంగనవాడి వర్కర్లు హెల్పర్లకు ప్రభుత్వం నోటీసులను అందజేస్తుందనీ వాపోయారు ఉద్యోగ నియమ నిబంధనల ఉల్లంఘన పై తగు శిక్షణ చర్యలు తీసుకొనుటకు సంజాయిషీ కోరుట గురించి అంటూ మెమో నెంబర్(1) గోడకు అతికించి వెళుతున్నారని ఎలాంటి బెదిరింపులకు తాము భయపడమని వారు నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు దీక్షను కొనసాగిస్తామని వారు తెలిపారు.

 

anganwadi workers strike 31day in atp

కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె

అనంతపురం జిల్లా – పుట్లూరు : మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం కూడా కొనసాగుతుంది వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ 31వ రోజు కూడా సమ్మె కొనసాగుతూనే ఉంది సమ్మెకు లో అంగనవాడి టీచర్స్ హెల్పర్స్ డిమాండ్లను పరిష్కరించేంతవరకు ఈ పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం లేనిపక్షంలో అనేక రూపాలలో సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాంసిపిఎం పార్టీ మండల కార్యదర్శి సూరి ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట చౌదరి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు టి పెద్దయ్య వ్యవసాయ కార్యదర్శులు మండల కార్యదర్శి బిభాస్కర్ రెడ్డి కెవిపిఎస్ నాగభూషణ్ మండల పుట్లూరు సిఐటి నాయకులు మహమ్మద్ బాషా ఓబులేసు రామచంద్రారెడ్డి అంగనవాడి మండల అధ్యక్షురాలు జయలలిత రమాదేవి శశికళ అనంతలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు

 

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరాహార దీక్షలు

 

anganwadi workers strike 31day in wg gokavarm

పగో-గణపవరం : కనీస వేతనాలు అమలు చేయాలని గత 31 రోజులుగా సమచేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ నాయకురాలు బి రామకోటి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 31 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. యస్మాలు నోటీసులు అరెస్టులుకి తమ భయపడమని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.వి మహాలక్ష్మి బండారు పార్వతి సిహెచ్ సీతామాలక్ష్మి ధనలక్ష్మి కళ్యాణి జయలక్ష్మి పాల్గొన్నారు.

anganwadi workers strike 31day in nellore

  • అంగనవాడి కార్మికులకు యుటిఎఫ్ సంఘీభావం

31 రోజులుగా అంగన్వాడీ కార్మికులు కనీసవేతనం, గ్రాట్యుటీ, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్స్ గా మార్చమని తదితర సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారు.ఈ రోజు వారి సమ్మెకు మద్దతుగా యుటియఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు, యుటియఫ్ జిల్లా మహిళా కన్వీనర్ మరియు తడ,సూళ్లూరుపేట,దొరవారిసత్రం మండలాల యుటియఫ్ నాయకులు శిభిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలియజేశారు.

anganwadi workers strike 31day in akp

అనకాపల్లి : అంగన్‌వాడీలపై విధించిన ఎస్మాను తక్షణమే రద్దుచేయాలని, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించి జీతాలను పెంచాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. సంక్రాంతిలోపు ఈ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించాయి. ఉద్యోగ కార్మిక సంఘాల సమ్మెలకు మద్దతుగా సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యాన గురువారం దొడ్డి రామునాయుడు భవన్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీంవగా తీర్మానం చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.శంకరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిడిపి, సిపిఐ, కాంగ్రెస్‌, జనసేన, ఆప్‌, ఎటిపి పార్టీలతో పాటు సిఐటియు, రైతు, యువజన, దళిత బహుజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలు లక్షల మందికి పైగా పిల్లలు, మహిళలు, గర్భిణీలకు సేవలందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో సేవలు పొందుతున్న లబ్దిదారులు ఎస్‌.సి,ఎస్‌.టి, బలహీన వర్గాలు, అసంఘటిత కార్మిక, పేద రైతు, వ్యవసాయ కార్మిక తదితర పేదలకు చెందినవారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణాలోకన్నా రూ.1000లు అదనంగా వేతనం పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని కోరుతూ సమ్మె గత 31 రోజులుగా నిర్వహిస్తున్నారు. వీరి న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా దుర్మార్గంగా ఎస్మాను ప్రయోగించింది. అంతకుముందే సెంటర్‌ తాళాలను పగలగొట్టడం, జనవరి 5లోగా విధులకు జాయిన్‌ కాకుంటే తొలగిస్తామని నోటీసుల్వివడం వంటి చర్యలకు పాల్పడిరది. అయినా అంగన్‌వాడీలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వెంటనే డ్యూటీలో చేరాలని అంగన్‌వాడీలకు డైడ్‌లైన్‌ విధించి బెదిరించడం హేయమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అబద్దాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. ఎస్మా ప్రయోగించినా కార్మికులు పట్టువీడటం లేదంటే వారి బాధ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అంగన్‌వాడీలు అత్యవసర విభాగం అని భావిస్తే ఇన్ని రోజులు ఎందుకు సమస్యను పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్‌కు శృంగభంగం తప్పదని, మహిళలే తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. సంక్రాంతిలోపు సమ్మెలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని పార్టీలు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతోపాటు, రాష్ట్ర బంద్‌ చేపడతామని హెచ్చరించారు.

ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజాన దొరబాబు, జనసేన జిల్లా కార్యదర్శి పావాడ కామరాజు, టిడిపి జిల్లా నాయకులు వెంకటరావు, సిపిఐ జిల్లా నాయకులు వై.ఎన్‌.భద్రం, సిపిఎం మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కట్టనూరి నూక అప్పారావు, ఆమ్‌ ఆద్మీ నాయకులు శ్రీనివాసరావు, ఆల్‌ తెలుగు ప్రజల పార్టీ నాయకులు రామచంద్రరావు, దళిత బహుజన సంఘం నాయకులు సూదికొండ మాణిక్యలరావు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కర్రి అప్పారావు, గండి నాయనబాబు, రైతు సంఘం నాయకులు కోరిబిల్లి శంకరారావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.శివాజీ, డి.శ్రీనివాసరావు, నూకఅప్పారావు, బి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

anganwadi workers strike 31day in vja

విజయవాడలో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష

 

anganwadi strike 31day in gnt

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ చేస్తున్న సమ్మెకు  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలపై సూపర్వైజర్లు అనేక రకాలైన ఒత్తిళ్లు తీసుకొస్తు బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులు సాగవు అన్నారు. అంగన్వాడి వర్కర్లు ఎవరు అధైర్య పడవద్దు అని అధికారుల ఒత్తిళ్లకు తలవంచవద్దని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు నిమ్మకురి రమేష్ బాబు, యూనియన్ అధ్యక్షురాలు ఎంవి సుకన్య, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️