9వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

kadapa anganwadi workers strike on 9th day a

ప్రజాశక్తి – యంత్రాంగం : అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర వ్యాప్త సమ్మె  9వ రోజు (బుధవారం) కొనసాగుతుంది.  ఈ  కార్యక్రమంలో అనేక చోట్ల అంగన్వాడీ కార్యకర్తలు పసిపిల్లలతో ర్యాలీ పాల్గొన్నారు. రోడ్లపై భిక్షాటన చేపట్టారు. వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలను  తాళాలు పగలగొట్టినా, బెదిరింపులకు గురిచేసినా, రాజకీయ ఒత్తిడిలు చేస్తున్న సడలని సంకల్పంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

akp anganwadi workers strike on 9th day a

  • ఐద్వా నాయకులు పుణ్యవతి మద్దతు 

అనకాపల్లి ప్రాజెక్టులోని కసింకోట, అనకాపల్లి మండలాల అంగన్వాడీ లందరూ కసింకోట జాతీయ రహదారి ప్రక్కన ఖాళీ స్థలంలో చేస్తున్న సమ్మె దీక్షలలో భాగంగా బిక్షాటన కార్యక్రమం చేశారు. ఈ దీక్ష శిబిరం వద్దకు అంగన్వాడి వ్యవస్థాపకులు మరియు ఆలిండియా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) కోశాధికారి పుణ్యవతి తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని, బడ్జెట్ ను పెంచాలని ,మహిళా సాధికారతను ప్రభుత్వాలు నిరూపించుకోవాల నీ, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగ ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి. ప్రభావతి, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబ్బాయి, జిల్లా కార్యదర్శి ప్రకాష్ ,ఐద్వా జిల్లా నాయకురాలు డి.డి. వరలక్ష్మి అంగన్వాడీల సమ్మెకు తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసరావు,  జిల్లా అధ్యక్షులు ఆర్. శంకర్, అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు ఎం .నాగ శేషు ,మండల నాయకులు తనుజ ,కాసులమ్మ, రామలక్ష్మి, ఆదిలక్ష్మి, ఉమా నారాయణమ్మ ,ధనలక్ష్మి, చిన్నారి, కుమారి , సంతోషి తదితరులు అంగన్వాడీ లందరూ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడి సమస్యలు తక్షణ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వ్యతిరేకి విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు.

 

kkd anganwadi workers strike on 9th day bs

కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో  అంగన్ వాడీల వంట వార్పు.
tpt anganwadi workers strike on 9th day

తిరుపతి జిల్లా నారాయణవనంలో సమ్మెలో సృహ తప్పి పడిపోయిన ఐ ఫ్ టీ యు మండల కార్యదశి పద్మాలత

knl anganwadi workers strike on 9th day

కర్నూల్ జిల్లా – పత్తికొండ : రివ్యూ మీటింగ్ హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డికు వినతిపత్రం ఇచ్చిన  అంగన్వాడీలు

 

kkd anganwadi workers strike on 9th day

9వ రోజుకి చేరిన అంగన్వాడీలు సమ్మె

విజయనగరం టౌన్ : డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె బుధవారానికి 9వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద వాహనాల్లో వెళ్ళే వారి వద్ద దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు, సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ లు మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కి భిక్ష ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్ళు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని కోరుతున్నామని అదనంగా మేము ఏమి కోరడం లేదన్నారు. 9 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట సాయంత్రం నాలుగు గంటల వరకు నిరసన కొనసాగించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

 

gnt anganwadi workers strike on 9th day tulluru

రాజధాని లోని తుళ్లూరు లైబ్రరీ సెంటర్ వద్ద బుధవారం నాడు అంగన్వాడీల మానవహారం

  • అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు పగలకొట్టే యత్నం… అడ్డుకున్న అంగన్వాడీలు

నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  అంగన్వాడీ కార్యకర్తలు వారి డిమాండ్లను వివరిస్తూ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకుండా ఉద్యమాన్ని ఆపేందుకు ప్రభుత్వం చేస్తున్న విధానాలను తిప్పికొడతామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు ,అంగన్వాడీలకు మధ్య గొడవలు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పలు ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగలకొడుతుంటే అడ్డుకున్నారు. జాకీర్ హుసేన్ నగర్ లో పోలీసులను, ఐసీడీఎస్ అధికారులను అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది..

gnt anganwadi workers strike on 9th day

గుంటూరు జిల్లా-చిలకలూరిపేట :  అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు (సిఐటియు) యూనియన్ ఆధ్వర్యం లో జరుగుతున్న అంగ న్వాడల చేస్తు న్న నిరవధిక సమ్మో సోమ వారం నాటికి ఎనిమిదోవ రోజుకి చేరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక పండరీ పురంలో రెండవ లైన్ లో గల సిఐటియు కార్యాలయం నుంచి ఎన్ ఆర్ టి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వంట వార్పు కార్యక్రమాన్ని డివిజన్ అధ్యక్షులు జి. సావిత్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షురాలు జి. సావిత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణి విడి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వా డీల సమస్యల పరిష్కారం కోసం కృషి చే యాలన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కన్వీనర్ పెరుబోయిన వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయా త్ర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ జీతం ఇస్తానని మాట తప్పరన్నా రు. సచివాలయ ఉద్యోగస్తులు కార్యదర్శులు తదితరుల ద్వారా అంగన్వాడీ కేంద్రంల తాళాలు పగుల కొట్టడం అన్యాయమని..ఈ తాళాలు పగుల గొట్టిన వారిని వెంటనే అరెస్టులు చేయాలన్నారు. అంటే కాకుండా ఈ అంగన్వాడీలను చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని లేకుం టే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడు తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల సెక్టార్లు లీడర్లు ఏ.పద్మ., పార్వతి., అంగన్వాడీలు, హెల్పర్లు, ఆయాలు, అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక నాయకులు తీయగూర ప్రతాపరెడ్డి, వ్యవసాయ కార్మిక సం ఘం డివిజన్ అధ్యక్షులు సాతులూరి లూథర్, చిలకలూరిపేట పట్టణ రి క్షా వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షు లు బి. కోటా నాయక్, ఐద్వా పట్టణ కార్యదర్శి పి.భారతి., ఏఐటీయూసీ నాయకులు ఏలూరు రామారావు, అఖిల భారత మహిళా సమాఖ్య కార్యదర్శి చేరుకుపల్లి విజయ నిర్మల తదితరులు పాల్గొని తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

బత్తలపల్లి మండల కేంద్రంమంలో తాసిల్దార్ కార్యాలయం ముందు 9వరోజు చేరుకుంది నాలుగు రోడ్ల కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ వచ్చే బిక్షాటన చేసారు

  • ఉరి తాళ్ళకు వేలాడుతూ వినూత్న నిరసన

అంగన్వాడి ఉద్యోగుల తమ సమస్యల పరిష్కారం కోసం తొమ్మిదవ రోజు బుధవారం సమ్మె కొనసాగించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న వారిని వైసిపి ప్రభుత్వం అరెస్టులు చేయించడంపై మరింత ఆందోళనకు దిగారు.
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం సద్భావన సర్కిల్లో అంగన్వాడీ వర్కర్లు ఆయాలు తొమ్మిదవ రోజు సమ్మె బయట పట్టారు. నిరసన చేస్తున్న చోటే మహిళలు మోకాళ్ళపై నిల్చుని ఉరి తాళ్ళకు వేలాడుతూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. బటన్ నొక్కు జీతాలు పెంచు అంటూ, జీతాలు పెంచనిపక్షంలో రాజీనామా చెయ్, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని సీఎం ఎందుకంటు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో భవిష్యత్తులో మీకు సరైన బుద్ధి చెబుతామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడి ఉద్యోగులు వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. అంగన్వాడి ఉద్యోగులు వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కనీసం పనికి తగ్గ వేతనాలు పెంచాలని పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. వేతనాలు పెంచి పదవీ విరమణ పొందిన వారికి పింఛన్ మంజూరు చేయాలని ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేయాలని ఆదేశించడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అంగన్వాడీల ఆందోళనకు తెలుగు నాడు కార్మిక సంఘం నాయకులు మద్దతు పలికారు. అదేవిధంగా మెడికల్ రెప్స్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ఆందోళనకు మద్దతు తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం మద్దతు తెలిపి వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, స్థానిక నాయకులు లావణ్య, శిరీష, శైలజ, టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి పరిమళ, కౌన్సిలర్లు మంజుళ, మహాలక్ష్మి, భారతి తో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు.

  • అంగన్వాడి టీచర్లు ఆయాలు బిచ్చటన

అనంతపురం జిల్లా-పుట్లూరు : మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు నిరసన కార్యక్రమం బుధవారానికి తొమ్మిదవ రోజు కూడా సమ్మె కొనసాగుతూనే ఉంది బుధవారం మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు బిచ్చటనను కూడా చేయడం జరిగింది . అనంతరం యూనియన్ లీడర్లు మరియు సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడి సమస్యలు వెల్ఫేర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు అనేక రూపాల్లో అనేకమైన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సూరి మాట్లాడుతూ అంగనవాడి యూనియన్ లీడర్ జయలలిత శశికళ అనంతలక్ష్మి రమాదేవి నాయకుల జి వెంకట చౌదరి, టి పెద్దయ్య, బి భాస్కర్ రెడ్డి, నాగభూషణ్, అంగన్వాడి టీచర్లు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

 

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంమంలో తాసిల్దార్ కార్యాలయం ముందు 9వ రోజు చేరుకుంది. నాలుగు రోడ్ల కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ వచ్చే బిక్షాటన చేసారు.

 

sklm anganwadi workers strike on 9th day a

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో అంగన్వాడీల వంటావార్పు…

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం గొల్లవీదిలో అంగన్వాడీ కేంద్రం తాళం బద్దలు కొడుతున్న సచివాలయం సిబ్బంది మున్సిపల్ కమిషనర్ రమేష్

konaseema anganwadi workers strike on 9th day

  • బిక్షాటన చేపట్టిన అంగన్వాడి వర్కర్ లు

బిఆర్ అంబేద్కర్ జిల్లా – రామచంద్రపురం : అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం కొనసాగుతున్న నిరవధికసమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. తొమ్మిదో రోజు అంగన్వాడీ కార్యకర్తలంతా రామచంద్రపురం పట్టణంలోని మెయిన్ రోడ్ లో భిక్షాటన గావించారు. కొట్టు కొట్టుకు వెళ్లి రెండు నెలలుగా జీతాలు లేవని తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తమకు ఆర్థిక సహాయం చేయాలని షాపు షాపుకు వెళ్లి బిక్షాటన గావించారు. పలువురు వ్యాపారులు బాటసారి వాహనదారులు అంగన్వాడి వర్కర్లకు చిల్లర నోట్లు దానం చేశారు. ప్రభుత్వం మండు వైఖరి విడనాడాలని, అంగన్వాడి వర్కర్లు జీతాలు పెంచాలని, న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమాల్లో సిఐటియు నాయకులు నూకల బలరాం, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, అంగన్వాడి యూనియన్ నాయకులు ఎం.దుర్గ తదితరులు ప్రసంగించారు. ఇక గ్రామాల్లో తొమ్మిది రోజులుగా అంగన్వాడీ సెంటర్లు తాళాలు వేసి ఉండటంతో వెల వెల పోతున్నాయి. చిన్నారులకు అందించాల్సిన పోషకాహారం పాలు తదితర అంశాలన్నీ ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.

 

manyam anganwadi workers strike on 9th day

పార్వతీపురం జిల్లాలో అంగన్వాడీల బిక్షాటణ

పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు కొనసాగిస్తున్న 9వ రోజు సమ్మెకు సిపిఐ ఎంఎల్ నాయకుల మద్దతు

వి.మాడుగులలో అంగన్వాడీల అందోళనలో చిన్నారుల డిమాండ్

annamayya anganwadi workers strike on 9th day

  • అంగన్వాడీల భిక్షాటన, ర్యాలీ..

అన్నమయ్య జిల్లా-రాజంపేట అర్బన్ : డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె బుధవారానికి 9వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం అక్కడి నుంచి అగ్నిమాపక కేంద్రం మీదుగా ర్యాలీగా తరలి వెళ్లి దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కి భిక్ష ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్ళు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నీరసనలో మునిసిపల్ కార్మికులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజిని, విజయ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.

 

kadapa anganwadi workers strike on 9th day muddaluru

కడప జిల్లా-వేంపల్లెలో అంగన్వాడీలు విన్నూతంగా రోడ్డుపై సాష్టాంగం నమస్కారం చేస్తు సమ్మె చేశారు.

 

  • గుడారం అద్దె భారమై ఎండలోనే సమ్మె…

కడప జిల్లా – ముద్దనూరు : అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన గుడారం అద్దె భారం కావడంతో అంగన్వాడీ కార్యకర్తలు గుడారం తొలగించి ఎండలోనే సమ్మె నిర్వహించారు.

 

prakasam anganwadi workers strike on 9th day

అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద బిక్షాటనలో పాల్గొన్న అంగన్వాడీలు

 

అల్లూరి జిల్లా రంపచోడవరం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద 9వ రోజు సమ్మె కార్యక్రమం కొనసాగుతుంది. దానిలో భాగంగా అంగన్వాడీ వర్క్స్ అండ్ హెల్పర్స్ అండ్ మినీ వర్క్స్ అందరు కలిసి ఒంటికాళ్ళు పై నిరసన వ్యక్తం చేశారు.

 

nellore anganwadi workers strike on 9th day

నెల్లూరు జిల్లా : అంగన్వాడి సమ్మెలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ప్రధాన రహదారి వెంబడి బిక్షాటన చేశారు.

rayachoti anganwadi workers strike on 9th day

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో 9వ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె

 

atp anganwadi workers strike on 9th day

  • సిఐటియు  ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు బిక్షాటన కార్యక్రమం.

అనంతపురం జిల్లా  అగళిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు మరియు హెల్పర్లు తమకు శాలరీలు పెంచాలని బత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 9వ రోజు అగళి మండలంలో చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పురవీధుల్లో ఉన్న ప్రతి అంగన్లకు దుకాణ్లకు దగ్గరికి వెళ్లి కార్యక్రమాన్ని చేపట్టారు. వారం రోజులపాటు ఎన్నో రాస్తారోకోలు ర్యాలీలు నిరసనలు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ మరియు 28 అంగన్వాడి సెంటర్ల కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు.

కడప జిల్లా దువ్వూరు మండలం అంగన్వాడి కార్యకర్తలు పుల్లారెడ్డిపేట నుండి స్థానిక గంగమ్మ దేవాలయం వరకు అలాగే తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు చంటి బిడ్డలతో కార్యకర్తలు ఎండలో ర్యాలీలో పాల్గొన్నారు

కడప జిల్లా దువ్వూరు మండలం అంగన్వాడీ కార్యకర్తలు పుల్లారెడ్డిపేట నుండి స్థానిక గంగమ్మ దేవాలయం వరకు అలాగే తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చంటి బిడ్డలతో కార్యకర్తలు ఎండలో ర్యాలీలో పాల్గొన్నారు.

kadapa anganwadi workers strike on 9th day

కడప మైదుకూరు పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తల భిక్షాటన

wg anganwadi workers strike on 9th day mogalturu

పగో-మొగల్తూరులో భిక్షాటన చేస్తున్న అంగన్వాడీలు

wg anganwadi workers strike on 9th day palakollu

  • పాలకొల్లులో వంటావార్పు

పగో-పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలో తమ ఆందోళనలో భాగంగా గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు చేసి ప్రభుత్వంకు నిరసన తెలిపారు. కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సిఐటియు సారధ్యంలో సమ్మెబాట పట్టారు. ఈ నేపద్యంలో 9 వ రోజు నిరసనలో భాగంగా అంగన్వాడీలు వంటావార్పు చేసి నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదని ప్రభుత్వం ను హెచ్చరించారు. ఇంకా అంగన్వాడీ నేతలు ఎం. శ్రీదేవి, బి. నాగలక్ష్మి, పి. పద్మావతి, ఎం. ఏ నసమ్మ, సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ పురుషోత్తం చల్లా సోమేశ్వర రావు,అంగన్వాడీలు పాల్గొన్నారు

 

wg anganwadi workers strike on 9th day

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి టీచర్స్ ఆయా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో తొమ్మిదవ రోజు సమ్మె వంటావార్పు కార్యక్రమం.

eluru anganwadi workers strike on 9th day lock

ఏలూరు జిల్లా – అంగన్వాడీలు తమ హక్కుల కోసం చేస్తున్న సమ్మె బుధవారం 9వ రోజుకి చేరింది. అంగన్వాడీ కేంద్రాల తాళాలను అధికారులు మూడు రోజుల క్రితం బలవంతంగా పగలగొట్టించారు. డ్వాక్రా యాని మేటర్లకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు . ఆయా కేంద్రాలకు పిల్లలను పంపేందుకు తల్లులు ఇష్టపడటం లేదు. అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు ఉంటేనే పిల్లలను పంపిస్తామని కొన్నిచోట్ల తల్లులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ బాధ్యతను తీసుకున్న డ్వాక్రా సిబ్బంది పిల్లలను ఆకర్షించేందుకు చాక్లెట్స్, లాలి పాప్స్ ఇస్తామని ఆశ పెడుతున్న పిల్లలు రాకపోవడం విశేషం.

 

chitoor amaravati workers strike on 9th day

చిత్తూరు జిల్లా యదమరి తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది.

amaravati workers strike on 9th day

అనకాపల్లి జిల్లా-కశింకోట : రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా అనకాపల్లి జిల్లా కశింకోటలో అంగన్వాడి కార్యకర్తలు నిరసన 9వ రోజు బువారం సమ్మె కొనసాగుతుంది.  ఈ  కార్యక్రమంలో జిల్లా అంగన్వాడి వర్కర్స్ హెల్పేర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగ శేషు మాట్లాడుతూ  26 వేలు జీతం ఇవ్వాలని ,  ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు డిడి వరలక్ష్మి సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీనివాసరావు అంగన్వాడి యూనియన్ నాయకులు తనుజ  కృష్ణవేణి కాసలమ్మ  ఉమనారాయణమ్మ , వరలక్ష్మి , స్యేమాల పార్యితి , జ్యోతి , ఆదిలక్ష్మి అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️