పసి పిల్లల ప్రాణాలతో చెలగాటమా.. : మాజీ మంత్రి కొల్లు

Feb 10,2024 12:57 #kollu raveendra, #machilipatnam, #TDP
  • బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన చిన్నారులకు పరామర్శ
  • నాసిరక మందుల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శ

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : కమిషన్‌లకు కకృతి పడి జగన్‌ ప్రభుత్వం నాసిరక మందులను పంపిణీ చేయడం వల్లే బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతకు లోనయ్యారని మాజీ మంత్రి టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. అస్వస్థతకు లోనయన పిల్లలను రవీంద్ర, మాజీ ఎంపి టిడిపి జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. అనంతరం రవీంద్ర విలేఖర్లతో మాట్లాడుతూ.. నాసిరకం మందులు పంపిణీ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని.. మందులు పంపిణీ చేసిన సాయి ఫార్మసిటికల్‌ కంపెనీని వెంటనే బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వా అనుయాయుల కంపెనీ సాయి ఫార్మా దాష్టికంతో పసి పిల్లల ప్రాణాలకి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా టైంలో కూడా వైసిపి నాయకులు బ్లాక్లో ఆక్సిజన్లు అమ్ముకోవడం వల్లే ఆక్సిజన్‌ కొరతతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. పసిపిల్లల పరిస్థితి విషమించినప్పుడు సరైన సమయంలో స్పందించి పిల్లలకు వైద్యులు ప్రాణం పోశారని.. వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ.. ఇంజక్షన్‌ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థతకు గురి రావడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. ప్రభుత్వం సరైన మందులు అందించకపోవడంతో ఇంజక్షన్‌ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం జరిగిందన్నారు. వైద్యులు సరైన సమయంలో స్పందిచకుంటే పెద్ద నష్టమే జరిగేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇలియాష్‌ షాషా, కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, మరకాని సమత కీర్తి, లంకె నారాయణ ప్రసాద్‌,బురక బాలాజీ , కుంభ రవి కిరణ్‌ , గోకుల్‌ శివ, మరకాని వాసు, పాలపర్తి పద్మజ,గుమ్మడి విద్యాసాగర్‌, వసంతకుమారి, సీతారామయ్య, బోయిన రాజు, లలిత్‌ రాజ్‌, లింగం విజరు,చిట్టూరి యువరాజు, మద్దాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️