నిర్విరామంగా ఆరోగ్యశ్రీ సేవలు

May 25,2024 08:56 #Arogyashree, #lakshmisa, #services
  • ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సిఇఒ జి లక్ష్మీశా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ సకాలంలో వైద్యం అందుతోందని, ఎక్కడా ఈ సేవలకు అంతరాయం ఏర్పడలేదని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సిఇఒ జి లక్ష్మీశా వెల్లడించారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించకుండా సేవలు అందించాలని చేసిన విజ్ఞప్తికి నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌ సహకరిస్తున్నాయని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3,566.22 కోట్లను నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌ ఖాతాలో జమ చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రూ.366 కోట్లను నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌కు జమచేశామని తెలిపారు. ఈ నెల 22న 6,718 మంది, 23న 7,118 మంది లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందారని వివరించారు. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో రోజుకు సగటున 5,349 మంది లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ సేవలు పొందారన్నారు. పొరుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన హాస్పటల్స్‌లో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉందన్నారు.

➡️