సిపిఎస్‌ సమస్యకు ఏడాదిలో శాశ్వత పరిష్కారం

– తెనాలి సభలో పవన్‌ కళ్యాణ్‌ హామీ
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలోగా సిపిఎస్‌ సమస్యను పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మార్కెట్‌ సెంటర్‌లో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైసిపి ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టిందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం దెబ్బ తీసే విధంగా నాసిరకం మద్యం విక్రయించారని ఆరోపించారు. సిఎం జగన్‌కు అధికారం తలకెక్కిందని, అహంకారంతో దోపిడీ, దౌర్జన్యాలకు వైసిపి వారిని ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. వైసిపి అరాచకాలపై రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాను బాధ్యతగా వ్యవహరిస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయినా తాను అధైర్య పడలేదని, పట్టుదలతో ముందుకెళ్తున్నానని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని, ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. రాజధాని అభివఅద్ధికి కఅషి చేస్తామని, అమరావతే రాజధానిగా ఉండాలని తమ విధామని స్పష్టం చేశారు. మహిళలపై దాడులను నివారించేందుకు చట్టాలను పటిష్టం చేస్తామని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి దాడి జరిగితే రాష్ట్రం గాయపడినట్టుగా వైసిపి నాయకులు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి వద్ద ఒక బిసి యువతిని వైసిపి కార్యకర్తలు వేధిస్తే.. దానిపై ప్రశ్నించిన ఆమె తమ్ముడిని చంపారని, దీనిపై సిఎం జగన్‌ కనీసం స్పందించలేదన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ చెల్లెళ్లు ఇద్దరు రోడ్డెక్కి ఆక్రందిస్తుంటే ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఇలాంటి ఎన్నో ఘటనలు రాష్ట్రాన్ని గాయపరిచాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సానుభూతి కోసం జగన్‌ ఏదో ఒక ఘటనను సఅష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై స్పందించాల్సిన అవసరం లేదని, ఇది కేవలం ‘నాన్నా పెద్దపులి’ సామెతలాగా మారిందని విమర్శించారు. సభలో టిడిపి గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, జనసేన తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, తదితరులు ప్రసంగించారు.

➡️